సజ్జల రామకృష్ణారెడ్డి పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం..!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హిట్ మీదున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన ఛానెల్ డిబెట్ లో అమరావతి చుట్టుపక్కల వేశ్యలు ఉన్నారనడం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా రచ్చగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది …మరోవైపు జాతీయ మహిళ కమిషన్ సైతం దీన్ని సుమోటోగా తీసుకుంది. మహిళల్ని కించపరుస్తు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు, ఆ తర్వాత పరిణామల గురించి తమకు మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ మాత్రం తమ నోటి దూలపనుల్ని మానుకొవడం లేదు…నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అమరావతి మహిళల్ని ఉద్దేశించి మరోసారి కాంట్రవర్సీ రాజేశారు. అక్కడ కొంత మంది సంకర జాతీ వాళ్లు ఉన్నారని, దెయ్యాలు, పిశాచాలు ఉన్నారంటూ దారుణంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యల్నికాంగ్రెస్ ఖండిస్తుందన్నారు. తప్పులు చేస్తే.. సారీ చెప్పి హుందాగా ఉండొచ్చని అన్నారు..

పుట్టపర్తి: మాజీ మంత్రి రోజా పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి

రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల్ల గురించి మాట్లాడే హక్కు YCP కి లేదు

రక్త సంబంధం విలువ ఏంటో నాకే తెలుసు

బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారం కి నేను బాధపడితే… నా ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి నేను ఎంత బాధ పడి ఉండాలి ?

నాకు అక్రమ సంబంధాలు అంటగడితే, నేను YSR కి పుట్టలేదు అని మీ సైతాన్ సైన్యం తో ప్రచారం చేయించారు

అన్న అడిగాడు అని,రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశా

అన్న ను ఎంతో ప్రేమించా.. పాప నీ ప్రాణం కావాలని అడిగినా వెంటనే ఇచ్చే దాన్ని

అక్క చెల్లెళ్ళు అనేది మీకు ఊత పదం మాత్రమే…..