బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా…!

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా.

* మధ్యాహ్నం 12.30 గంటలకు విచారణను వాయిదా వేసిన హైకోర్టు.

* రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

* రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న లాయర్లు.

* షెడ్యూల్‌ విడుదల అయ్యిందని బెంచ్‌కు తెలిపిన లాయర్లు.

* సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావించిన లాయర్లు.

* 6 పిటిషన్లను ఒకేసారి వింటామన్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌..
బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు…

తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

కాగా, బీసీ రిజర్వేషన్లపై అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించడానికి అవకాశం లేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించింది ప్రభుత్వం. హైకోర్టు ఒకవేళ ఈ జీవోను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉంది..