బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ…

*బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ.*

ఇంప్లీడ్‌ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు.

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే.. ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు నిబంధన ఉందని ప్రస్తావించిన పిటిషనర్‌ లాయర్‌..

ఇంప్లీడ్ పిటిషన్లు

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెం 9 జారీ చేసింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్శాఖ సైతం 41, 42 జీవోను జారీ చేసింది. ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు (రిజర్వేషన్లు 50% దాటొద్దు) విరుద్ధమని, ఆ జీవోలను కొట్టేయాలని రెడ్డి జాగృతి నేత బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల27న హౌస్‌మోషన్పిటిషన్దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో కోర్టు 1లో 42 అంశంగా ఈ పిటిషన్‌ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్‌ ధర్మాసనం ఎదుటకు రానున్నది. ఈ పిటిషన్‌పై దాదాపుగా 25 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లీడ్పిటిషన్దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూజుల శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, చరణ్కౌశిక్యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్చిరంజీవులు సహా అనేక మంది పిటిషన్లుదాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా వీరందరూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా గుర్తింపు రావడానికి ఇదొక అవకాశమని వారు కోర్టుకు వివరించనున్నారు..