బెంగళూరు మెట్రోలో యువతిని చిత్రీకరించాడని ఆరోపణ.. నిలదీస్తే పారిపోయాడని బాధితురాలి ఆవేదన!

బెంగళూరు మెట్రోలో యువతిని చిత్రీకరించాడని ఆరోపణ.. నిలదీస్తే పారిపోయాడని బాధితురాలి ఆవేదన!

కర్ణాటకలోని బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిని ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించాడని ఆమె ఆరోపించారు. ఎందుకు చిత్రీకరిస్తున్నావని ఆమె నిలదీయగా, స్టేషన్ రాగానే అతడు బయటకు పరుగెత్తాడని చెప్పారు. యువతి అతడిని వెంబడించి అతని ఫోన్‌ను తీసుకుని, ఎందుకు చిత్రీకరించావని మళ్లీ అడిగినప్పుడు అతను అస్పష్టమైన సమాధానాలు ఇచ్చాడని, తాను ఏమీ చిత్రీకరించలేదని చెప్పి, ఫోన్ లాక్ చేసి, తెరిచి చూపిస్తానంటూ అక్కడి నుంచి పారిపోయాడని ఆమె ఆరోపించారు. మెట్రో స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరిస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు, ఎలాంటి వివరణ ఇంకా ఇవ్వలేదు..