ఇటలీ నుంచి ఇండియాకు టూర్ వచ్చిన 16 మంది వ్యక్తులు… ఒకరు మృతి…!

సముద్రంతో చెలగాటం వద్దు.. అలలను నమ్మొద్దు.. ముంచేస్తాయ్.. అంటూ మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ హెచ్చరించారు.. అయినా వారు వినలేదు.. సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ లోతులోకి వెళ్లారు.. ఇంకేముంది.. అలలు చుట్టుముట్టి ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి..16 మంది ఇటలీ దేశస్తులు.. వారంతా ఇటలీ నుంచి ఇండియాకు టూర్ వచ్చారు.. దీనిలో భాగంగా అన్నీ పర్యాట ప్రదేశాలను చుట్టేస్తూ.. వైజాగ్‌లో దిగారు.. ఈ క్రమంలోనే.. యూరాడ బీచ్‌కు సరదాగా వెళ్లారు. ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. ఈ క్రమంలోనే.. నీటిలో దిగి సరదాగా ఆడుకుంటూ కనిపించారు.. అయితే.. వాళ్ల తీరు చూసి.. లోతు ఎక్కువగా ఉంది.. సముద్రంతో చెలగాటం వద్దు.. అలలను నమ్మొద్దు.. ముంచేస్తాయ్.. అంటూ మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ హెచ్చరించారు.. అయినా వారు వినలేదు.. సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ లోతులోకి వెళ్లారు.. ఇంకేముంది.. అలలు చుట్టుముట్టి ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి.. మరికొందరు నీటిలో కొట్టుకుపోతుంటే.. చూసి.. మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు.. ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో.. ఇటలీకి చెందిన మరో 15 మంది కన్నీరుమున్నీరుగా విలపించారు..