ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భేటీకి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు.
తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందాం : 2014లో రాష్ట్ర విభజన జరిగినా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విభజన చట్టం అమలుపై లోతుగా హోంశాఖ సమీక్షించింది. సమన్వయంతో రెండు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇరు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని తెలిపింది..
ఇరు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేసింది. నిధుల పంపకాల విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
9, 10 షెడ్యూల్లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలతో ముందుకు వెళ్లాలని హోంశాఖ సూచించింది. పలు అంశాలపై తదుపరి సమావేశంలో ఒక నిర్ణయానికి వద్దామని హోంశాఖ తెలుగు రాష్ట్రాల అధికారులకు తెలిపింది….నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోంశాఖ సూచించినట్లు సమాచారం. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు రాష్ట్రాలకు నష్టం వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ విభజనచట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పినట్టు పలువురు తెలిపేరు…