మట్టిపెళ్లలు విరిగిపడి 17మందికి పైగా మృతి..!

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్‌తో పాటు సుఖియా పొఖారీ ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడి 17మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

విచారణ వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
మరోవైపు బంగాల్‌ డార్జిలింగ్‌ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల దృష్ట్యా డార్జిలింగ్‌ ప్రాంతంలో పరిస్థితిపై నిశిత పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు..