ముగిసిన బీహార్ ఎన్నికల ప్రచారం.. పోలీసుల కీలక ఆదేశాలు…!

ముగిసిన బీహార్ ఎన్నికల ప్రచారం.. పోలీసుల కీలక ఆదేశాలు.

బీహార్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార సమయం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులు పలు ఆదేశాలను జారీ చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రజలు గుమికూడరాదని బీహార్ పోలీసులు గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు..

మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో బీహార్‌ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోడ్ అమల్లో ఉందని.. ప్రజలు ఎక్కడా గుమికూడదని ఆదేశించారు. రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేవరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు…ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్‌ కూటమికి చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్డీయే తరఫున జేడీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్, యోగీ ఆదిత్యనాథ్‌ ప్రచారం చేశారు. ఇక విపక్ష కూటమి తరఫున రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌ సహా ఇతర నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. మరి ఈసారి బీహార్‌ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. ..