బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవ్వరో మరికాసేపట్లో తేలనుంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది. ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రతి ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని వివరించింది..
బీహార్‌లో మహాఘట్బంధన్ కంటే ఎన్డీయే తొలి దశలో ఆధిక్యంలో ఉంది..
బీహార్ ఎన్నికల ఫలితం: బీహార్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతున్న తరుణంలో, నితీష్ కుమార్ వరుసగా ఐదవసారి అధికారంలోకి రాగలరా లేదా మహాఘటబంధన్ ఓటమిని చవిచూడగలరా అనేది పెద్ద ప్రశ్న. ముందస్తు ట్రెండ్లు ఎగ్జిట్ పోల్స్‌ను పరీక్షిస్తాయి, ఇవి అధికార వ్యతిరేకత గురించి చర్చలు ఉన్నప్పటికీ NDA విజయాన్ని సునాయాసంగా అంచనా వేస్తున్నాయి..
ఎన్డీఏ 160 శాతం ఆధిక్యంలో ఉంటుందా లేదా బీహార్ కీలక దశకు చేరుకుంటుందా? శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు, నితీష్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణం ప్రతిపక్ష మహాఘట్బంధన్ కంటే ముందంజలో ఉంది.
పోస్టల్ బ్యాలెట్లు NDA కి ముందస్తు ఊరటనిచ్చాయి, ప్రారంభ ట్రెండ్స్‌తో పాలక కూటమి 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని చూపించగా, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని RJD నేతృత్వంలోని మహాఘటబంధన్ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది..
ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 167 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం ఉండగా, 69 స్థానాల్లో మహా ఘట్ బంధన్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే 6 స్థానాల్లో ముందంజలో ఇతరులు ఉన్నారు. బీజేపీ 72,జెడియు 72,ఎల్ జేపీ 20,హెచ్ ఏ ఎం 2,ఆర్ ఎల్ ఎం 1, ఆర్జేడీ 44 ,కాంగ్రెస్ 17, వీఐపీ 2, లెఫ్ట్ 6, 1 స్థానంలో ముందంజ లో జన్ సురాజ్ పార్టీ,6 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు…
మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కనిపిస్తోంది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది..
బీహార్‌లో ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ పార్టీ.
బిహార్‌లో ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రభావం చూపించడం లేదు. 2 సీట్లలో లీడింగ్‌లో జన్‌సురాజ్ పార్టీ ఉంది. 230 సీట్లలో జన్‌సురాజ్ పార్టీ పోటీ చేసింది. ప్రస్తుతం 3శాతం ఓట్లతో ఉన్న జన్‌సురాజ్ పార్టీ.. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో NDA హవా కొనసాగుతోంది.
14 Nov 2025 10:59 AM .
ఎన్డీయే వైపు నిలిచిన మహిళలు.
బీహార్‌లో మహిళలు NDAవైపు నిలిచారు. ఎన్నికలకు ముందు కొత్త పథకాన్ని నితీష్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం తీసుకువచ్చింది. మహిళల ఖాతాలో రూ.10వేలు వేసింది సర్కార్. 25 లక్షల మహిళల ఖాతాలో రూ.10వేలు జమ చేసింది. అయితే ఎన్డీయే ప్రస్తుతం 180 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.