నెక్స్ట్ వేసేది నిన్నే..బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపులు..!?

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (SP) జాతీయ ప్రతినిధి తారిఖ్ ఖాన్‌ (Tariq Khan) పేర్కొన్నారు.గత రెండు నెలలుగా బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి తనకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నా తాను పట్టించుకోలేదని అన్నారు. తాజాగా మరోసారి కాల్‌ చేసి తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్ట్స్‌ నువ్వే ఉన్నవంటూ బెదిరించారని.. రెండు రోజులు ఆగితే తాము ఏం చేస్తామో తెలుస్తుందని అన్నారని వెల్లడించారు.

వెంటనే ఈ విషయాన్ని ఎస్పీకి, తమ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశానన్నారు. దీనిపై పోలీసు సూపరింటెండెంట్ రామానంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిజంగానే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వ్యక్తులు ఈ కాల్‌ చేశారా లేక సైబర్‌ నేరగాళ్ల పనా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎస్పీ నేతకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరో స్టాండప్‌ కమెడియన్‌ అసభ్యకర వ్యాఖ్యలు.. విమర్శిస్తున్న నెటిజన్లు
ఇప్పటికే పలుమార్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి పలుమార్లు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు ఎదురయిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఆ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. సల్మాన్‌ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique)ని వీరు దారుణంగా హత్య చేయడంతో గతంలో వీరి పేరు తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్‌ నాయకుడైన లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈవిధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు…