నోయిడాలో షాకింగ్‌ ఘటన..సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ విదేశీ అమ్మాయిల రాక..వ్యభిచార రాకెట్‌ దందా గుట్టురట్టు….!

నోయిడాలో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. వ్యభిచార రాకెట్‌ దందాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బట్టబయలైంది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు..
https://x.com/Vishal0700/status/1905956272463041014?t=CUh23UcHv6AijnRu4aBgpQ&s=19
అలాగే, వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్‌ దందా నడుపుతున్నారు. ఈ జంట సైప్రస్‌కి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్‌స్టర్, స్ట్రిప్‌చాట్ వంటి ప్రసిద్ధ శృంగార వెబ్‌సైట్‌లను నిర్వహిస్తోంది. వీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, ప్రధానంగా ఫేస్‌బుక్ ఉపయగించి మోడల్‌లను నియమించుకుంటారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని ”ఎచాటో డాట్ కామ్” అనే పేజీని క్రియేట్ చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ప్లాట్‌కు వచ్చిన తర్వాత, వీరికి రాకెట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. నెలకు రూ. 1 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చారు.

అధికారులు దాడి చేసిన సమయంలో, ఈ జంట ఉంటున్న ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడాల్ట్ కంటెంట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్‌లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్స్‌కు ఇచ్చేవారు.

కాగా, ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఈడీ కనుగొంది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్‌లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు..