బీజేపీ కి అన్నామలై గుడ్‌బై..!

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత పవర్ఫుల్ అండ్ క్రేజీ లీడర్గా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు… బిజెపి కి తమిళనాడులో ఒక ఊపు తీసుకొచ్చిన నాయకుడు అన్నామలై. ఇతడు ఒక ఐపీఎస్ అధికారి. రాజకీయాల మీద ఆసక్తి.. తమిళ గడ్డకు ఏదైనా చేయాలి అనే ప్రేమతో తన సర్వీస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు..ప్రతి అంశం మీద లోతైన విశ్లేషణ చేయడం.. ప్రజా సమస్యల మీద మాట్లాడటం అన్నా మలై కి అలవాటు. అదే అతడిని తమిళనాడులో తిరుగులేని నాయకుడిగా చేసింది. వాస్తవానికి అన్నామలై లాంటి నాయకుడు మరొక పార్టీలో ఉంటే నెత్తిన పెట్టుకునేవి. కానీ, తమిళనాడులో బిజెపికి అది చేతకాలేదు. అధిష్టానానికి అర్థం కాలేదు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 13% ఓటు బ్యాంకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అన్నామలై. ఎన్డీఏ కూటమి మొత్తానికి 17% శాతం ఓటు బ్యాంకు నమోదయింది. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ అధిష్టానం అన్నామలై విషయంలో స్టాండ్ మార్చుకుంది. అన్నా డీఎంకే అధినేత “ఈపీఎస్” ఒత్తిడికి తలవంచి అన్నామలై ని బిజెపి అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది. ఇది తమిళనాడులో కమలం పార్టీకి మొదటి దెబ్బ. ఆ తర్వాత అన్నా డీఎంకే చెప్పిన స్థానాలలోని బిజెపి పోటీ చేయాల్సి వచ్చింది. అవన్నీ అత్యంత బలహీనమైన స్థానాలు. పనికిమాలిన అన్నా డీఎంకే ఒత్తిడి వల్ల బిజెపి గెలిచే స్థానాలు కోల్పోవడంతో పాటు.. పోటీ చేసే స్థానాల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.

బిజెపి తమిళనాడు అధ్యక్షుడు నుంచి మొదలు పెడితే తమిళ సై సౌందర రాజన్ వరకు తమ స్థానాలను మార్చకుండా అన్నా డీఎంకేతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే వారు కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి పార్టీని కూడా బతికించలేకపోయారు. ఎన్నికల్లో బిజెపికి రెండు శాతం ఓటు బ్యాంకు వచ్చిందంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలో కమలం పెద్దలే నిర్ణయించుకోవాలి.

బిజెపి అధిష్టానం వ్యవహరించిన తీరుతో అన్నామలై తీవ్ర అంతర్మదనంలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బిజెపికి రాజీనామా చేసి.. ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని.. పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై బిజెపి పెద్దలకు వర్తమానం పంపినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు బిజెపి పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు తమిళనాడులో ద్రావిడ వాదానికి సంబంధం లేకుండా రాజకీయాలను రూపొందించాలని అన్నామలై భావిస్తున్నారు. బిజెపి ద్వారా దానిని భర్తీ చేయాలని అనుకున్నారు.

ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో ద్రావిడ వాదంతో తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేసే ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాయి. చివరి నిమిషంలో విజయ్ మేల్కోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ద్రావిడ వాద సెంటిమెంట్ నిత్యం రగిలిస్తూ.. తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు. వాటికి ప్రత్యామ్నాయంగా బిజెపిని రూపొందించాలని అన్నామలై భావించారు. కానీ అధిష్టానం తలతిక్క వ్యవహార శైలి వల్ల ఆయన పార్టీకే దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా బిజెపి అధిష్టానం మేల్కొంటుందా.. అన్నామలైకి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి….

విజయ్‌ను ఢీకొట్టే వ్యూహం

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ (TVK) స్థాపించిన తర్వాత అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం తమిళనాడులో విజయ్‌ను రాజకీయంగా సవాలు చేసే సరైన ప్రత్యామ్నాయ నాయకుడు లేరని, ఈ తరుణంలో నేరుగా కాకుండా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నామలై యోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే ఆయన తొలుత ఎలాంటి పొలిటికల్ రంగు లేని ఒక ‘రాజకీయేతర ప్రజా ఉద్యమాన్ని’ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజల్లో బలమైన పునాది ఏర్పడిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా, అన్నామలైకి కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కబోతోందని, లేదా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ముఖ్య అనుచరులు స్పష్టం చేశారు…

రూట్ మార్చాలని డిసైడ్

సీఎం విజయ్ రాకతో తన పొలిటికల్ రూట్ మార్చాలని అన్నామలై డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, అన్నాామలై వాటిని ఎక్కడా ఖండించలేదు. కాగా, నివేదికల ప్రకారం.. ఆయన బీజేపీ జాతీయ నాయకత్వం ముందు రెండు ఆప్షన్లు పెట్టినట్లు సమాచారం.

ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై.. చాలా తక్కువ సమయంలోనే తన దూకుడు, ఆర్గనైజింగ్ స్కిల్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు. విమర్శకులు సైతం ఆయన ఎనర్జీని మెచ్చుకునేవారు. అయితే, ఆయన రాజకీయం ఎప్పుడూ బీజేపీ సాంప్రదాయ హిందుత్వ చట్రంలో ఇమడలేదు. అన్నాామలై తన ప్రసంగాల్లో మతపరమైన వ్యాఖ్యల కంటే తమిళ అస్తిత్వం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, అభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడేవారు. చాలామంది విశ్లేషకులు దీనిని ఆస్పిరేషనల్ ద్రావిడ రాజకీయంగా అభివర్ణించేవారు. సిద్ధాంతాల కంటే కూడా రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడమే ఆయన లక్ష్యంగా ఉండేది..