ఢిల్లీలో కాంగ్రెస్, వామపక్షాలు, ప్రతిపక్షాల అల్లర్లను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నాం..కొండ హరీష్ గౌడ్
ఢిల్లీలో కాంగ్రెస్, వామపక్షాలు, ప్రతిపక్షాల అల్లర్లను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.
ప్రధాని నివాసం ముందు రాహుల్ గాంధీ ధర్నా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: కొండ హరీష్ గౌడ్
హుజూర్నగర్: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అల్లర్లు, ఆందోళనలను తీవ్రంగా ఖండిస్తూ *హుజూర్నగర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* ఈరోజు పట్టణ బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిన ప్రతిపక్షాలు అల్లర్లు, విధ్వంసకర ఆందోళనలకు పాల్పడటం సరికాదన్నారు. దేశ ప్రజలు తిరస్కరించిన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేయడం తీవ్రంగా ఖండించాల్సిన చర్య అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని *కొండ హరీష్ గౌడ్* ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని, ప్రతిపక్షాలు తమ బాధ్యతను విస్మరించి కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాల దేశ వ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హుజూర్నగర్ *బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ తో పాటు జిల్లా సీనియర్ నాయకులు కుందూరు కోటిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి రామారావు, పట్టణ ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్, యువమోర్చా నాయకులు సతి బలవంత్ సింగ్, మురళి మరియు తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.