కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూన్నారు..ధన్ పాల్.

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్లను ఈడీ చార్జిషీట్ లో చేర్చడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ (Hyderabad ED Office) ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Former MP Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy)పై దుర్భాషలాడారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చార్జ్ షీట్ లో చేర్చడంతో కాంగ్రెస్ నిరసన చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలోనే కిషన్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దారుణమని ధన్ పాల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. నిజాలు బయటపడుతుంటే భరించలేని కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ బీజేపీ నాయకులపై, ప్రధాని మోదీపై అశ్లీల పదజాలంతో దుషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. వీధి గుండాలు వ్యవహరించినట్లు వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. గతంలో బండి సంజయ్, ఆర్ఎస్ఎస్ నాయకులపై కూడా బెదిరింపులకు పాల్పడటం కాంగ్రెస్ గుండా రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని ఎమ్మెల్యే ధన్ పాల్ డిమాండ్ చేశారు..