హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు..– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ..

ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదు..

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పాడు..

హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలను అలాగే వేధిస్తున్నాడు..

హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారు..

తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడు.

హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు..– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైడ్రా వ్యవహారశైలిని చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఇల్లు కొనేందుకు కూడా సాహసించడం లేదని ఆయన ఆరోపించారు..హైడ్రా కూల్చివేతలు మరియు నోటీసుల పద్ధతి కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం, సామాన్య ప్రజల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. అక్రమ లేఅవుట్లతో సంబంధం లేని అమాయకులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు..అక్రమార్కులను, బడా బాబులను వదిలేసి పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హస్మత్‌పేట వంటి ప్రాంతాలలో జరిగిన కూల్చివేతలపై ఆయన స్వయంగా ధర్నాలు చేసి, పేదలకు అన్యాయం జరుగుతోందని,ప్రభుత్వం హైడ్రాను ఒక ‘హిట్లర్’ తరహా వ్యవస్థలా మార్చిందని, ఆ సంస్థ అధికారుల తీరు చట్టవ్యతిరేకంగా ఉందని విమర్శించారు. హైడ్రా వ్యవహారాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు..