10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి…! పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ..!

10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్‌ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.