‘సముద్రంలో ఘోర ప్రమాదం.. 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా | Boat Accident |
ఐరోపా దేశమైన సైప్రస్‌లో చోటు చేసుకున్న విషాద ఘటన మద్యధరా సముద్రంలో 270 మందితో వెళ్తున్న ఓ ఫెర్రీ బోటు బోల్తా పడింది నార్త్ సైప్రస్‌లోని కైరేనియా (గిర్నే) పోర్టు నుంచి టర్కీకి వెళ్తుండగా ప్రమాదం
ఈ ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ 237 మంది ప్రయాణికులను రక్షించిన అధికారులు గల్లంంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్..
ఉత్తర సైప్రస్ తీరంలో ఆదివారం ఘోర ఫెర్రీ ప్రమాదం జరిగింది. సుమారు 270 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న క్యాటమరాన్ తరహా ఫెర్రీ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. చాలామందిl పైగా ప్రయాణికులను రక్షించినట్లు ఉత్తర సైప్రస్ ప్రధానమంత్రి ఉనాల్ ఉస్తెల్ వెల్లడించారు.
కైరేనియా నుంచి టసూకుకు వెళ్తుండగా..
ఉత్తర సైప్రస్‌లోని కైరేనియా (గిర్నే) పోర్టు నుంచి టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఉన్న టసూకు పోర్టుకు ఫెర్రీ బయలుదేరింది. ఈ మార్గం సముద్ర ప్రయాణాలకు రద్దీగా ఉంటుంది. అయితే ఫెర్రీ ఏ సంస్థకు చెందినదో అధికారికంగా ఇంకా వెల్లడించలేదు…స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తీరం నుంచి సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఫెర్రీలోకి నీరు చేరడం ప్రారంభమైంది. కొద్దిసేపటికే నౌక అదుపు తప్పి సముద్రంలో బోల్తా పడింది.
ప్రాణభయంతో సముద్రంలోకి..
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకారు. ప్రమాదానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో బోల్తా పడిన ఫెర్రీ చుట్టూ లైఫ్ జాకెట్లు ధరించిన పలువురు ప్రయాణికులు నీటిలో కనిపిస్తున్నారు.