హుజూర్‌నగర్‌లో ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు.

హుజూర్‌నగర్‌లో ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు..

హుజూర్నగర్ పట్టణంలో ఎప్పుడూ అంటూ ఎదురుచూసే ముత్యాలమ్మ పండగ డేట్ చేసిన నిర్వాహక కమిటీ.. దాదాపు హుజూర్నగర్ లో జరుగుతున్న ఈ ముత్యాలమ్మ జాతర కన్నుల పండగ నిర్వహించడం జరుగుతుంది.. కోరిన కోరికలు తీర్చే పోచమ్మ తల్లిగా అమ్మవారిని కొలుస్తారు.. ఈ జాతరకు విచ్చేయడానికి చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు అలాంటి జాతర ఎప్పుడో డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది.. కులాలకి మతాలకి అతీతంగా ఈ జాతర నిర్వహిస్తారు.. జాతరను వీక్షించేందుకు దూర ప్రాంతాల వారు కూడా భారీగా తరలివస్తుంటారు..

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ముత్యాలమ్మ జాతర.. 10న కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు
హుజూర్‌నగర్: పట్టణంలో ప్రతి ఏడాది ఘ..నంగా నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల సెప్టెంబర్ 6 (ఆదివారం), 7 (సోమవారం) తేదీల్లో ముత్యాలమ్మ జాతర నిర్వహించాలని ముత్యాలమ్మ జాతర నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలోని రామాలయం సెంటర్‌లో జాతర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతర నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించి ఉత్సవాల తేదీలను ఖరారు చేశారు.
సెప్టెంబర్ 3 (గురువారం) సల్లకుండ ఎత్తే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 6న పెద్ద ముత్యాలమ్మ తల్లి, సెప్టెంబర్ 7న చిన్న ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 10 (గురువారం) కనకదుర్గమ్మ అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది.
జాతర ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ముత్యాలమ్మ జాతర నిర్వహణ & నిర్మాణ కమిటీ సభ్యులు, కుల పెద్దలు తెలిపారు…