పిల్లల మెదడుకు మంచి ఆహారం…

*పిల్లల మెదడుకు మంచి ఆహారం…

పిల్లల మెదడు పెరుగుదలలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు.. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగా మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం మీ పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.పిల్లల మెదడు పనితీరును పెంచేఆ ఆహార పదార్థాలేంటో చూసేయండి.

*1.బెర్రీలు :*
బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

*2.వేరుశనగ :*
మెదడు, నాడీ వ్యవస్థకు శక్తి కోసం గ్లూకోజ్ ఉపయోగించాలి. థమిమిన్ తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. ఇందులోని న్యూరోనల్ పొరలను సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.

*3.పండ్లు, కూరగాయలు :*
ఆరోగ్యకరమైన దృఢమైన మెదడు కణాలను నిర్వహించే యాంటీ ఆక్సిడెంట్లు టమాటాలు, చిలకడ దుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బచ్చలికూర, పాలకూర వంటి కూరగాయలు సూపర్ ఫుడ్స్ గా మారి మెదడు పనితీరులో జ్ఞాపకశక్తిని పెంచే విధంగా పనిచేస్తాయి.

*నాన్ వెజ్ ఆహారం తీసుకునేవారు…*

*1.గుడ్లు :*
గుడ్లలో ప్రోటీన్, కోలిన్ ఉంటాయి. ఇవి జ్ఞాపకాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.

*2.సాల్మన్ చేప :*
కొవ్వు చేపలు సాల్మన్, మాకేరెల్ వంటివి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా DHA, ఇది జ్ఞాపకశక్తి, కంటి చూపు, మొత్తం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.