బీఆర్ఎస్,, కాంగ్రెస్ రెండు ఒకటే గూటి పక్షులు..కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి.

Kishan Reddy On CM KCR: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ బీజేపీనేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రజల పోరాటం మరువలేనిదన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చేసిన దీక్షను బట్టబయలు చేసింది ఖమ్మం ప్రజలేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు.. ఒకసారి కాంగ్రెస్‌తో ఇంకోసారి వేరే పార్టీతో కలిసి అస్తిత్వం కోసం పాకులాడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.”చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక పార్టీతో కలవాల్సిన అవకాశవాద రాజకీయాలు వాళ్లవి. ఎవరిపైన పోరాటం చేయాలో.. వాళ్లపై చేయకుండా.. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ విచక్షణా రహితంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నది. చివరకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఆయనతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుంది. దీనిపై కమ్యూనిస్టు పార్టీ క్యాడర్.. పార్టీ పెద్దలను నిలదీయాలి..