.
తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నేత, హుజూర్ నగర్ మాజీ జడ్పీటీసీ, డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపిన.. బీఆర్ఎస్ నాయకులు, యూత్.. మరియు నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు..
ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అడ్డరోడ్ లో హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.. సైదన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో.. మలిదశ ఉద్యమ నాయకులు, లీగల్ సెల్ కన్వీనర్, అడ్వకేట్ నగేష్ రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుపులేటి నరసింహారావు,బీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లంకెపల్లి నాగార్జున, బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు ములకలపల్లి రాంబాబు, ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు బచ్చలకూరి నాగశేఖర్,హుజూర్ నగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు అభిమళ్ళ నాగరాజు, మెరిగ వంశీ, సాయి, స్థానిక BRS నాయకులు సాయి శ్రీనివాసరాజు, కస్తాల నాగేశ్వరరావు, రవీందర్ , ప్రేమ్ కుమార్, మరియు కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.