స్టేట్ పాలిటిక్స్ (State Politics)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) నేత, రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అరెస్ట్ అయ్యారు…గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad)లోని వెస్ట్ మారేడ్పల్లి (West Marredpally)లో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి మాసబ్ ట్యాంక్ పీఎస్కు తీసుకున్నారు. కాగా, బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా, ఎర్రోళ్లను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం జరగడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు….
కుట్ర పూరితమే..’
తన అరెస్టుపై ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమంగా తనను అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రశ్నిస్తున్న వారిని వేధిస్తోందని.. 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా పని చేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని నిలదీశారు. ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
అటు, శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్రావు (HarishRao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?’ అని ప్రశ్నించారు. ‘అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు.. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది.’ అని ట్వీట్ చేశారు.