పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్…

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ గట్టి పోరాటం చేసిందని, పార్టీ మారిన ఎమ్మెల్సీలపైన కూడా సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఇటీవల పార్టీ నాయకులతో జరిగిన చర్చల్లో నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా వారి అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్‌ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. న్యాయస్థానమే వారిపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో వారిపై అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఏళ్ళ తరబడి పార్టీ ఫిరాయింపుల కేసులు పెడింగ్‌లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది..