శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్..
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది.
తాతా మధు, నవీన్‌రెడ్డిలను శాసనమండలి నుంచి సస్పెండ్ చేశారు. సభలో నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శాసనమండలి సమావేశాలు ముగిసే వరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ కొనసాగనుంది.
ఇదే సమయంలో శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలి నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనమండలి ఆమోదించింది. తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలను బలవంతంగా మార్షల్స్ లాక్కెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు..అంతకుముందు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను సభలో పలువురు సభ్యులు ఖండించారు. ఈ క్రమంలో తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌కు పంపించారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బలపరిచారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఆధారాలతో కౌన్సిల్‌కు పంపాలని తీర్మానించారు…