సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ లో
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల విఫల పాలనపై BRS చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు నిరసన కార్యక్రమం…
BRS మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరుకు నిరసనగా హుజూర్ నగర్ కేంద్రంలోని DR అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి…. పాల్గొన మహిళా బిఆర్ఎస్ సర్పంచ్ లు , బిఆర్ఎస్ పార్టీ దళిత సంఘ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు..
ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు .. వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలుపుతుంటే ఆ హక్కు కూడా లేనట్లు పోలీసులని మహిళలపైకి దురుసుగా వ్యవహరించేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు . బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి వేయి రోజులు గడిచినా కానీ ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు ఏందంటూ టీచర్లు వేసుకో రావడమే తప్ప.. అలా అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కూడా నల్ల కలర్ వస్త్రాలు ధరించి పార్లమెంటుకి హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు…అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి పోయింది.. రేవంత్ రెడ్డి పాలనలో అట్టర్ ప్లాప్ అయ్యారని ఆరోపించారు..
పలువురు మహిళలు పార్టీ లోని దళిత నాయకులు మాట్లాడుతూ..
స్పీకర్ ని ఏమీ అనకముందే కన్నీరు పెట్టుకోవడం . కొత్తరకం డ్రామా కి తెర లేపారని అన్నారు.. మహిళలని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోతుంటే అప్పుడు రాని బాధ పేరు కూడా ఉచ్చరించకుండా పదవిని అంటేనే వచ్చిందా అంటూఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు దళితులకు 10 లక్షల రూపాయలతో దళిత బంధు అందించడం జరిగిందని చెప్పారు.. దళితులకి 12 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు..
హుజూర్నగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి,, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు , కడియం వెంకట రెడ్డి , , ఆరిబండి సురేష్ బాబు , కిస్టిపాటి అంజి రెడ్డి , మన్నెం శ్రీనివాసరెడ్డి , ఇరుగు పిచ్చయ్య , బెల్లంకొండ అమర్ గౌడ్ , బచ్చు శ్రీనివాసరెడ్డి , కడియం స్వప్న వెంకట రెడ్డి , బచ్చు పద్మావతి శ్రీనివాస్ రెడ్డి , కొండారెడ్డి , ప్రియాంక , చేన్నబోయిన సైదులు , మోర్తాల వెంకట రెడ్డి , పచ్చిపాల ఉపేందర్ , మాజీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ మండల కమిటీల నాయకులు, అన్ని గ్రామాల మాజీ కమిటీల సభ్యులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.