పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు బాటిళ్లు…పార్టీ మారిన 10 మంది ద్రోహుల్లారా.. అంటూ ఫ్లెక్సీ ని కర్రలతో చెప్పులతో కొట్టిన నాయకులు..!

అన్ని దారులు ఎల్కతుర్తి వైపే పయనమవుతున్నాయి. సభా ప్రాంగణం అంతా కళాకారుల ఆటపాటలతో మార్మోగిపోతోంది. ఈ సభలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఆ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బాటిల్స్, కర్రలు, చెప్పులతో కొట్టారు కార్యకర్తలు.
పార్టీ మారిన 10 మంది ద్రోహుల్లారా చూడండి మిమ్ములను ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీ ప్రజాదరణ అంటూ సభ వద్ద ప్లెక్సీలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ ఉన్నారు.