లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం..!!*

కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు హోంశాఖ సిఫార్సు మేరకు పాకిస్తాన్‌కి చెందిన 16 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం…

*చిత్తూరు జిల్లా కుప్పం..*

కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం..

కేవలం 9 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు..

టిడిపి గుటికి చేరుకున్న ముగ్గురు వైసిపి కౌన్సిలర్లు..

కుప్పం మున్సిపల్ చైర్మన్ కూర్చి టిడిపి ఖాతాలోకి వెళ్లడం ఖాయమనీ తెలుస్తోంది..

కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారీ…

*ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు*

*కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలి: హైకోర్టు*

ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మరణించిన మాణిక్యాలరావు అనే కార్మికుడు విషయంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది. మరో రూ.20లక్షలు ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని హై కోర్ట్ తీర్పునిచ్చింది…

పాకిస్తాన్‌ను హెచ్చరించిన అసదుద్దీన్ ఒవైసీ

పాకిస్తాన్ ISIS లాంటిది.. పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు

పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయకులను చంపేశారు..

పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే, మేము భయపడము – అసదుద్దీన్ ఒవైసీ అన్నారు..

హైదరాబాద్…

జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి…

ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించనున్న సీఎం

నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు

కాల్పుల విరమణ, శాంతిచర్చల అంశంపై
జానారెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

*_Telangana: ఈనెల 30న టెన్త్‌ ఫలితాలు..!!_*

*_సన్నాహాలు చేస్తున్న అధికారులు_*

*_మెమోల్లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా.._*

*_వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కుల ఎత్తివేత!_*

హైదరాబాద్‌: ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్‌ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి టెన్త్‌ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ«దీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు.

ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకూ నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవగా, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు తెలిసింది. ఈనెల 30న భట్టి సమయం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

*_మెమోల్లో మార్పులు_*
టెన్త్‌ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గ్రేడింగ్‌ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాల్లో వెల్లడించారు.

ఇప్పటివరకూ విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం. ఇప్పుడీ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్‌తో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఉగ్రదాడిపై బీబీసీ తప్పుడు కథనాలు… తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం

పహల్గామ్ దాడిపై వక్రీకరించే కథనం రాసిన బీబీసీ..

ఉగ్రదాడిని ‘మిలిటెంట్ దాడి’గా పేర్కొన్న బీబీసీ…

బీబీసీ ఇండియా హెడ్‌కు కేంద్ర విదేశాంగ శాఖ లేఖ..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడిని ‘మిలిటెంట్ దాడి’గా అభివర్ణించడాన్ని తప్పుబడుతూ, బీబీసీ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆక్షేపించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ, బీబీసీ ఇండియా విభాగాధిపతి జాకీ మార్టిన్‌కు లేఖ రాసింది.

“కశ్మీర్‌లో దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారత్ రద్దు చేసింది” అనే శీర్షికతో బీబీసీ ప్రచురించిన కథనంలో, పహల్గామ్ ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొనడానికి బదులుగా “మిలిటెంట్ దాడి” అని ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇది వాస్తవాలను వక్రీకరించడమేనని, బాధితుల పట్ల అగౌరవాన్ని సూచిస్తుందని లేఖలో పేర్కొంది. ఉగ్రదాడి తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారని విమర్శించింది.

వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని బీబీసీకి సూచిస్తూ, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా విదేశాంగ శాఖ తమ లేఖతో పాటు పంపింది. ఆ రోజు పట్టపగలు, రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గామ్ దాడి విషయంలో ఇలా వివాదాస్పద పదజాలం వాడటం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం, అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ఈ దాడిని ‘మిలిటెంట్ దాడి’గానే అభివర్ణించింది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో పాటు, అమెరికా విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకుని అది ‘ఉగ్రవాద దాడి’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీబీసీ కూడా అదే బాటలో నడవడంపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

పహల్గామ్ దాడి విషయంలో బీబీసీ అనుసరిస్తున్న వైఖరి, వారి ఉద్దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై వార్తా కథనాలు ప్రచురించేటప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ ఆశిస్తోంది…

తిరుమలలో మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్దు.

తిరుమల: తిరుమలలో మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. జులై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ప్రోటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 

*వీఐపీ బ్రేక్‌ దర్శనాల్లో మార్పు*

మే 1 నుంచి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి బ్రేక్‌ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మే 1 నుంచి జులై 15 వరకు అమలువుతందని పేర్కొంది….

*హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడు అరెస్టు?*

ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యం లో భారత ప్రభుత్వం పాకి స్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకో వాలని నిర్ణయించింది.

ఇప్పటికే కేంద్రం పాక్ పౌరు లకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమ త్తమయ్యాయి.

తెలంగాణలోనూ పోలీసు అధికారులు రాష్ట్రవ్యాప్తం గా తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిం చిన తనిఖీల్లో పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతను మహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించబడ్డా డు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఫయాజ్ గతం లో దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ జీవించేవాడని, ఇటీవల హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడని తేలింది.

తన భార్యను కలిసేందుకు పాకిస్తాన్ నుంచి నేరుగా రావడం కష్టమని భావించి, నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి చివరకు హైదరా బాద్‌కు చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మహమ్మద్ ఫయాజ్ ఈ విధంగా ఎలా భారత్‌లోకి ప్రవేశించాడు? అతడికి సహాయం చేసిన ఇతర వ్యక్తులు ఉన్నారా? అతడి రాక వెనుక ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు.

ఫయాజ్ ప్రయాణ వివ రాలు, వీసా సమాచారం, నేపాల్ నుంచి వచ్చిన దారులు, అతడి ఇతర సంబంధాలపై అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నా రు. విచారణ పూర్తయిన తర్వాత, అతడిని పాకిస్తాన్‌కు డిపోర్ట్ చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన మరోసారి పాకిస్తాన్ పౌరులపై కేంద్ర ప్రభుత్వం తమ నిఘాను బలపరుస్తున్నట్లు స్పష్టంగా చూపిస్తోంది. భద్రతా పరంగా ఏ విషయానికీ రాజీపడకుండా, ప్రతి చిన్న వివరాన్ని పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రజల భద్రతకే ప్రాముఖ్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది..

పాక్ సరిహద్దులో భారత నేవీ మిస్సైల్ ప్రయోగాలు

భారత నేవీ అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించింది. పాక్ సరిహద్దు సమీపంలో మిస్సైల్ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. లాంగ్ రేంజ్ స్ట్రైక్స్క సిబ్బందిని, ప్లాట్ఫామ్స్ ను సంసిద్ధం చేస్తోంది. ‘మన దేశ సముద్రతీరానికి రక్షణగా ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా నేవీ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది’ అని భారత నేవీ వ్యాఖ్యానించింది.