ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేంద్రకు జరిగిన శాస్తి మిగతా ఎమ్మెల్యేలకు కూడా జరుగుతుంది… ఒంటెద్దు నరసింహారెడ్డి..
సూర్యాపేట జిల్లా…..
నేరేడుచెర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో నియోజకర్గ సమన్వయకర్త
ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ…
రైతుల పొలాలు ఎండుతుంటే కనీసం స్థానికంగా ఉన్న మంత్రి నీటి లెక్కలు తేల్చడంలో ఉత్తంకుమార్ రెడ్డి విఫలమయ్యారు…
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేంద్రకు జరిగిన శాస్తి మిగతా ఎమ్మెల్యేలకు కూడా జరుగుతుంది…
22a పై ఎక్కడ బిఆర్ఎస్ ప్రశ్నిస్తుందో అనే భయంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ…
కెసిఆర్ భూములపై సర్వే అంటూ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి బ్రదర్ చేస్తున్న ఆగడాలు, అడ్డగోలు సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, బయటకు తెలుస్తాయని భయంతో మాజీ సీఎం కేసీఆర్ పై లేనిపోని ఆరోపణన చేస్తూ ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ పలుచనైందని ఆరోపించారు..
పొలాలు ఎండుతుంటే దానిపై కనీసం చర్చ లేకుండా, ఆంధ్రాకి నీరుని దానధర్మం చేస్తున్నారని అన్నారు. .
తెలంగాణకి న్యాయబద్ధంగా రావాల్సిన శ్రీశైలం నీటి వాటాను రాబట్టడంలో ఉత్తంకుమార్ రెడ్డి విఫలమయ్యారు.. నిండు అసెంబ్లీలో అబద్దాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు…
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అసెంబ్లీలో నీటి అంశంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఒంటెద్దు ఆరోపించారు. శ్రీశైలం నీటి వాటా విషయంలో 11 వేల క్యూసెక్కులు రావాల్సి ఉండగా 4 వేల క్యూసెక్కులకు మించి నీరు రావడం లేదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, హుజూర్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి యల్లబోయిన లింగయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ జయబాబు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లంకెపల్లి నాగార్జున, బీఆర్ఎస్ నాయకులు పోకబత్తిని శేఖర్, చిట్యాల శ్రీను, రవీందర్ కల్లూరు మాజీ సర్పంచ్ నాగరాజు, చంద్రగిరి, తదితరులు పాల్గొన్నారు..