కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు..
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత..
రెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు..
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం..
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు..
సాగు నీటి కోసం రోడెక్కిన అన్నదాతలు
గద్వాలలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి
జూరాల డ్యాం మీద రహదారి సైతం దిగ్బందం
జూరాల ప్రాజెక్టు మీద ఆదారపడి ఉన్న కుడికాలువ రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలంటూ ధరూర్ మండలం జూరాల డ్యాం మీద రైతులు ధర్నా
అదే విధంగా గద్వాల మండలం పలు గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ముంద ఉన్న కర్నూల్ రహదారిపై బైఠాయింపు
అటు డ్యాం మీద, ఇటుగద్వాలలో ఒకే సారి జూరాల కుడి కాలువ రైతాంగం ఆందోళన..