బిగ్ బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేశారు. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కవిత కాంట్రావర్సీ కామెంట్స్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె గ్రౌండ్ లెవల్లో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు. ..