పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను (Bus Fare Hike) వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారని, బస్‌చార్జీలను పెంచుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ సిటీలో పెంచిన బస్‌చార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికుల సాదకబాధలు తెలుసుకున్నారు..అనంతరం బస్‌భవన్ వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీని ముంచేందుకు కుట్ర చేస్తున్నదని, ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ‘సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయం. మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నాం. అయితే కుడిచేత్తో మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి.. ఎడమ చేత్తో వారి భర్తపై భారీగా భారాలు మోపుతారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి పు రుషుల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారు. బస్ టికెట్ ధర పెంచడం దారుణం’ అని మండిపడ్డారు. దీనికి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.