గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తుంది… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
*సూర్యాపేట జిల్లా* ……
హుజుర్ నగర్ రేపు, ఎల్లుండి
జరగనున్న మేఘా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి….
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 25న హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన మేఘా జాబ్
మేళాకు అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో రోజు కొనసాగించాలని 25, 26న నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి జాబ్ మేళాలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 36 వేలకు చేరిందని, ఆ సంఖ్య జాబ్ మేళా సమయానికి 40 వేలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం రోజున హుజుర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మంత్రి హుజుర్ నగర్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.పి నరసింహ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తో పాటు డి.ఇ.ఇ.టి,సింగరేణి కాలరీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు..గ్రామీణ ప్రాంత యువత పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం సంపాదించాలంటే కష్టమవుతుందని ఉద్దేశంతోనే ఈ మెగా జాబ్ మేళాను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చేశామన్నారు. రెండోరోజు కూడా జాబ్ మేళా కొనసాగుతున్నందున నిరుద్యోగ యువతీ యువకులు ఎటువంటి ఒత్తిడికి లోను కావలసిన అవసరం లేదన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రెండో రోజుకు పొడగించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కొంత మేర సహనం పాటించి ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగ యువతీ, యువకులకు ఉన్న విశ్వసనీయతకు అర్థం అవుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట తాజాగా జరిగిన గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ నియామకాల ప్రక్రియతో కలుపుకుని రెండేళ్ల వ్యవధిలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తాము ఇప్పుడు నిర్వహిస్తున్న మేఘా జాబ్ మేళాకు ఇంతటి స్పందన లభించిందన్నారు. ఈ మేఘా జాబ్ మేళాలో జాతీయ,అంతర్జాతీయ, స్థానిక పరిశ్రమలన్నింటిని కలుపుకుని మొత్తం 275 పరిశ్రమలు పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. ఇలాంటి కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి పాల్గొనడం శుభపరిణామంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు…