కెనడాలో స్థిరపడ్డ ఖలిస్థాన్ టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ సర్కార్…

టెర్రరిస్టులపై ఉక్కుపాదం
కెనడాలో స్థిరపడ్డ ఖలిస్థాన్ టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపింది మోదీ సర్కార్. హర్‌దీప్ సింగ్ నిజ్జర్, గుర్పత్‌వంత్‌ పన్నుకు చెందిన ఆస్తుల్ని జప్తు చేసింది. చండీఘర్, అమృత్‌సర్‌, జలంధర్‌లో మెరుపుదాడులు చేసి.. వాళ్ల ఆస్తుల్ని సీజ్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రెండు ఖరీదైన స్థలాల్లో జప్తు సంబంధిత హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ విధంగా కెనడాలోని ఖలిస్థాన్ తీవ్రవాదుల పట్ల తమ వైఖరి ఎంత కఠినంగా ఉండబోతుందో గట్టి సంకేతాలిచ్చింది భారత ప్రభుత్వం…కెనడాలో ఉంటున్న హిందువులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కెనడా రాజ్యాంగం మీద విశ్వాసం లేని మీరంతా ఆ దేశాన్ని వదిలిపొండి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ ఆయన చేసిన కామెంట్… వివాదాస్పదమౌతోంది. అటు.. నిజ్జర్ హత్యకు ఇండియన్ హైకమిషనర్ వర్మ బాధ్యత వహించాలా వద్దా అంటూ ఒపీనియన్ పోల్ పెట్టాడు. ఇలా వివాదాస్పద చేతలతో చెలరేగిపోతున్న గుర్పత్‌వంత్‌పై చర్యలకు దిగింది భారత ప్రభుత్వం…