రాజకీయ లబ్థి కోసం శ్రీరాముడు, శివుడి మధ్య విభజన సృష్టించే ప్రయత్నాలు చేయడం హిందూ ధర్మ స్ఫూర్తికి విరుద్ధమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటనలో విమర్శించారు..’ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం’ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దేవుళ్ల మధ్య కూడా రాజకీయ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ‘దక్షిణ కాశీ’ వేములవాడ, ‘దక్షిణ అయోధ్య’ భద్రాచలం ఉన్న తెలంగాణలో సీఎంగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు..మాత్రం కులాలు, ప్రాంతాల మధ్యేకాకుండా ఇప్పుడు శివుడికి, రాముడికి మధ్య హాలాహలం చిమ్ముతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో హామీల కోసం దేవుళ్లను సాక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి… నేడు అదే దేవుళ్లకు ప్రాంతాలు, వర్గాలు ఆపాదించడం శోచనీయమన్నారు. ‘శివాయ విష్ణురూపాయ.. శివరూపాయ విష్ణవే’ అనే సనాతన ధర్మ సత్యం ప్రకారం హరిహరులను ఏకం చేయాలే తప్ప విడదీయకూడదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకోవడం మానుకోవాలని సూచించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.