యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి..SI సందీప్ రెడ్డి…

డ్రగ్స్,సైబర్ నేరాల పై అవగాహన

చింతలపాలెం పోలీస్ స్టేషన్*

ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు చింతలపాలెం SI సందీప్ రెడ్డి మండల కేంద్రంలోని సీతా మొమోరియల్ పాఠశాలలో షీటీమ్స్,డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

SI సందీప్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.*
*ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు*
*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. ఎవరైనా పాఠశాల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయించిన సేకరించిన రవాణా చేసిన సరఫరా చేసిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.

యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు

అనంతరం పోలీసు కళాబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తోమస్, అధ్యాపక బృందం, కానిస్టేబుల్ కవిరాజు, రవి, చంద్రయ్య, ప్రేమ్ చంద్, కళాబృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున , కృష్ణ,పాల్గొన్నారు.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959