ట్రంప్‌ గోల్ఫ్‌ క్లబ్‌వైపు దూసుకొచ్చిన విమానం.. అలెర్ట్ అయిన ఫైటర్‌ జెట్స్‌…!

అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) గోల్ఫ్ రిసార్ట్‌ వద్ద భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. న్యూజెర్సీ (New Jersey)లో గోల్ఫ్‌ క్లబ్‌ సమీపంలో నోఫ్లైజోన్‌ (no-fly zone) ప్రాంతంలోకి ఓ ప్రయాణికుల విమానం (civilian plane) దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఫైటర్‌ జెట్స్‌ (Fighter jets) రంగంలోకి దిగాయి..ఫాక్స్‌ న్యూస్‌ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. బెడ్‌మినిస్టర్‌లోని ట్రంప్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (Trumps golf club) సమీపంలో నోఫ్లైజోన్‌ ప్రాంతంలోకి ప్రయాణికుల విమానం ఒక్కసారిగా దూసుకొచ్చింది. విమానం రాకను గమనించిన ఫైటర్‌జెట్స్‌ వెంటనే రంగంలోకి దిగి ఆ విమానాన్ని అడ్డుకున్నాయి. ఓ రకమైన జ్వాలతో ప్రయాణికుల విమానం పైలట్‌ను అప్రమత్తం చేశాయి. దాన్ని నోఫ్లై జోన్‌ నుంచి పంపించేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ గోల్ఫ్‌ క్లబ్‌ రిసార్ట్‌లోనే ఉన్నారని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్‌ డిఫెన్స్ కమాండ్‌ (NORAD)ను ఊటంకిస్తూ ఫాక్స్‌ న్యూస్‌ నివేదించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది..

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959