వచ్చే జూన్ 2 లోపు భూసేకరణ కోసం రూ.600 కోట్లు మంజూరు.. సీఎం రేవంత్.

ములుగు జిల్లా, ఏటూరు నాగారం మండలం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు…

వచ్చే జూన్ 2 లోపు భూసేకరణ కోసం రూ.600 కోట్లు మంజూరు చేస్తామని చెప్పాను. వచ్చే బడ్జెట్ సమావేశాల లోపు అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం పొందాలని అధికారులను ఆదేశించాను. నెల లోపల దేవాదుల పంప్ రిపేర్ చేయాలని ఆదేశించాను. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళిక పైన నివేదిక ఇవ్వాలని ఆదేశించాను.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేయొద్దని హితవు పలికారు. అక్కడ సెటిల్ అయిన వారికి తామెందుకు సహకరిస్తామని ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) ములుగు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తుపాకులగూడెం దేవాదుల ప్రాజెక్టుని సందర్శించారు. దేవాదుల పనుల పురోగతిపై అధికారులతో సీఎం రేవంత్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పక్క రాష్ట్రాల వారితో చర్చించి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు విలువైన సూచనలిస్తే స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు. ఓటేయకపోవడం ప్రజలదే తప్పు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి నది జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే నిధుల కొరత వచ్చిందని ప్రస్తావించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు… అన్ని నిధులనూ విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6వేల అంచనాతో మొదలై.. రూ.18,500 కోట్లకు అంచనాలు పెరిగాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పుకొచ్చారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందని అన్నారు. ప్రాజెక్టులు, నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలంతా జ్ఞానవంతులమని తాము చెప్పడం లేదని.. మీరు సూచనలు చేస్తే తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు…

ఈ సమీక్షలో సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీమతి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు. వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..