కేసీఆర్ వల్ల కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి తీరని అన్యాయం.. సీఎం రేవంత్.

ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలోనూ పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి… కరువు, పేదరికాన్ని స్వయంగానే నేనే కళ్లార చూశాను అని చెప్పారు. కృష్ణా నదీ ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్(KCR) సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాం. ఆయన ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. బహిరంగ సభల్లో మాట్లాడిన దానికంటే.. చట్ట సభల్లో మాట్లాడిన మాటలకే ఎక్కువ విలువ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఆయన ప్రజల కంటే పార్టీకి, పార్టీ మీటింగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దీంతో చట్టసభల పట్ల బీఆర్ఎస్‌కు ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడిందని అన్నారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి కారణాలేమీ లేవని తెలిపారు. ఈసారి సభలో ఎవరూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని అన్నారు. దీనిపై అవసరమైతే నిజనిర్ధారణ కమిటీ వేయండి అని కీలక వ్యాఖ్యలు చేశారు..కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ఆయన ఎందుకు అలా చేశారో అసెంబ్లీకి వస్తే అడుగుదాం అనుకున్నా. ఉద్దేశపూర్వకంగా చేశారా?.. ఎవరైనా తప్పుదోవ పట్టించారా అనే విషయాన్ని అడగాలని అనుకున్నా. 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపులే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959