బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారాల పుత్రుడు. సుధీర్‌రెడ్డి గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది…
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గంజాయి కేసులో చిక్కుకున్నారన్న సమాచారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న ఆదినారాయణరెడ్డి కుమారుడిపై వచ్చిన ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి..
గంజాయి కేసులో ఇరుక్కున్న సుధీర్‌రెడ్డి.. ఇలా చెబితే ఏదో నార్మల్ కేసులా అనిపిస్తుంది.. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్‌రెడ్డి గంజాయి కేసులో ఇరుక్కున్నాడంటే.. పొలిటికల్‌గా హిట్ రాజుకుంది. . ఇప్పుడదే జరుగుతోంది ఏపీ రాజకీయంలో. సుధీర్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారాల పుత్రుడు. అది కూడా అధికారకూటమిలో కీలక సభ్యుడిగా ఉన్నారు.
గతంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన నేతగా కొనసాగుతున్నారు. అలాంటి నాయకుడి కుమారుడు మత్తుపదార్థాల కేసులో ఇరుక్కున్నాడన్న వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. అధికార కూటమి నేతల కుటుంబ సభ్యులపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపినట్లు సమాచారం..
అధికారుల పనితీరు పై ప్రశంసలు..!
మామూలుగా రాజకీయ నేతల పిల్లలు ఇలాంటి విషయాల్లో పట్టుబడితే పేర్లు, గట్రా బయటకు రావడం చాలా అరుదు. కానీ థాంక్ గాడ్ ఈగల్ టీమ్‌కు సెల్యూట్ చేయాలి. ఒక ఎమ్మెల్యే కొడుకును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా డీ అడిక్షన్ సెంటర్‌కు కూడా పంపారు. అతడి మత్తు వ్యవహారం లోకానికి తెలిసేలా చేశారు.
ఈయనగారు ఎలా దొరికాడో ఒకసారి ఆరా తీస్తే..ఈగల్టీమ్కు పక్కా సమాచారంతో హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో దాడులు నిర్వహించింది. ఆసమయంలో సుధీర్‌రెడ్డితో పాటు 17మంది ఉన్నారు. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ తేలింది. పోనీ దొరికాడు గమ్ముగున్నాడా లేదు..ఈగల్ టీమ్‌తో చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేశాడని తెలుస్తోంది. మత్తులో అలా చేశాడా..లేక ఆయనగారి స్వభావం అంతేనా..అన్నది తెలియదు కానీ, ఒక ప్రజాప్రతినిధి కొడుకు ఇలా వ్యవహరించడం మాత్రం ప్రజలకు మింగుడుపడడంలేదు. ఇప్పుడిదే పాయింట్ మీద రాజకీయ ప్రత్యర్ధులు నిగ్గదీసి అడుగుతున్నారు. గంజాయి బ్యాచ్‌లో మునిగిన కూటమి ప్రభుత్వ ఎమ్మల్యే కొడుకు అంటూ హెడ్‌లైన్స్ పెట్టి, రాజకీయంగా చాకిరేవుపెడుతున్నారు.ప్రతిపక్షాలు నుంచి తీవ్ర విమర్శలు.. గుప్పిస్తున్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959