సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండ సురేఖ..!

CM Revanth Reddy – Konda Surekha.. రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం రేవంత్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు రాఖీ’ని ఆయన చేతికి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతోపాటు ఆయన అల్లుడు, మనుమడికి కూడా కొండా సురేఖ రాఖీలు కట్టారు..తర్వాత ఆమె వెంటనే సీఎం నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరిపైనా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు ఆయనకు సంపూర్ణ శక్తి సామర్థ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. షోకాజ్‌ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా.. పండుగ వాతావరణంలో తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని మంత్రి స్పష్టంచేశారు.