సీఎం యోగితో షమీ భేటి..ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసి అందరి దృష్టి ఆకర్షించారు…!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాధ్‌ (Yogi Adityanath)తో భారత క్రికెటర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) భేటీ అయ్యారు. ఈ క్రమంలో షమి సీఎం యోగికి బుకే ఇచ్చారు…అనంతరం ఇరువురి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ భేటీ అనంతరం క్రికెటర్ మహమ్మద్ షమి ఆసక్తికర ట్వీట్ చేశాడు. అందులో “ఈరోజు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాధ్‌ను కలిసే గౌరవప్రదమైన అవకాశం నాకు లభించింది. ఈ భేటీలో మా చర్చలు దార్శనికత, నాయకత్వం, మన రాష్ట్ర పరివర్తన అవకాశాలపై దృష్టి సారించిన అంతర్దృష్టులతో సమృద్ధిగా సాగాయి. స్థిరమైన అభివృద్ధి, సామాజిక పురోగతిని నొక్కి చెబుతూ.. వృద్ధికి ఒక బలమైన రోడ్‌మ్యాప్‌ను ముఖ్యమంత్రి వివరించారు. ఇది సమాజాలను శక్తివంతం చేయడంలో ఆయన నిబద్ధత లోతుగా ప్రతిధ్వనిస్తుంది.

అలాగే సానుకూల మార్పుకు దోహదపడేలా మనందరినీ ప్రేరేపిస్తుంది. మన సమాజాభివృద్ధికి ఇంత అంకితభావంతో సీఎం ఉండటం ప్రజలకు ఎంతో భరోసానిస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు వైపు ఈ సహకార ప్రయాణంలో భాగం కావడానికి నేను ఆసక్తిగా ఉన్నాను.” అని రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా మహమ్మద్ షమి.. భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాడు. దీంతో అతనిపై పలు ముస్లిం సంఘాలు, పెద్దలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అతని భార్య విడాకుల తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న షమి ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే…