డొనాల్డ్‌ ట్రంప్‌ కాల్పులకు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడు..

డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడిగా గుర్తింపు
ఇటీవల ‘ఫస్ట్‌లా’ పేరుతో మరో గేమ్‌పై పనిచేస్తున్నట్లు తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు.

ఇంకా, 2014లో నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌లో నిర్వహించిన ఫెలోషిప్‌ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.

ప్రస్తుతం టెస్ట్‌ ప్రిపరేషన్‌ ట్యూటరింగ్‌ సంస్థ అయిన C2 Educationలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

2024 డిసెంబర్‌లో ‘టీచర్ ఆఫ్ ది మంత్’గా కూడా ఎంపికైనట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

రాజకీయ పరంగా చూస్తే, అతడు డెమోక్రటిక్ పార్టీకు సానుభూతిపరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 25 డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పాల్గొన్న వైట్‌హైస్ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌ (White House Correspondents Dinner) మీట్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడు ఒక ఉన్నత విద్యావంతుడిగా వెల్లడైంది. అతడిని దర్యాప్తు బృందాలు 31 ఏళ్ల కోలో టామోస్‌ అలెన్ (Cole Tomas Allen) ‌గా గుర్తించాయి. కాలిఫోర్నియా (California) లోని లాస్‌ ఏంజెలెస్‌ శివార్లలో ఉన్న టోరెన్స్‌ ప్రాంత వాసిగా గుర్తించారు. అతడి లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ (Engineering Degree) పూర్తి చేశాడు…థామస్‌ అలెన్‌ 2017లో కాల్టెక్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే వీల్‌ఛైర్స్‌కు ఎమర్జెన్సీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా రూపొందించాడు. ఈ అంశం గురించి స్థానిక పత్రికలో కథనం కూడా వెలువడింది. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్‌ కోసం రిజిస్టర్‌ చేసుకొన్నాడు. ఇటీవల ‘ఫస్ట్‌లా ’ పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు. 2014లో జెట్‌ ప్రొపెల్షన్‌ ల్యాబ్‌లో నాసా నిర్వహించిన ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో కూడా అతడు పాల్గొన్నాడు.

ప్రస్తుతం టెస్ట్‌ ప్రిపరేషన్‌ ట్యూటరింగ్‌ కంపెనీ సీ2 ఎడ్యూకేషన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో ఉంది. డిసెంబర్‌ 2024లో టీచర్‌ ఆఫ్‌ ది మంత్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇక రాజకీయ నేపథ్యం చూస్తే.. డెమోక్రటిక్‌ పార్టీకి సానుభూతిపరుడిగా తెలుస్తోంది. కమలా హ్యారిస్‌ అధ్యక్ష ప్రచారానికి 25 డాలర్లు విరాళం కూడా ఇచ్చినట్లు ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రికార్డులు చెబుతున్నాయి.