కాంగ్రెస్‌లో కొండా సురేఖపై ఫిర్యాదు..

కాంగ్రెస్‌లో కొండా సురేఖపై ఫిర్యాదు
మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీని కలిశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండా సురేఖ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు.

వేటు తప్పదా…!?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వరుస వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉండి.. కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సురేఖ అదుపు చేయకపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.