సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు సస్పెన్షన్…. !
హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కట్ట రమేష్ కు వ్యతిరేకంగా పనిచేసిన చావా వీరభద్రరావు, భాస రామారావు, నకిరేకంటి అప్పారావు, పోతబత్తిని శ్రీను,, దగ్గుపాటి నాగరాజు, రచ్చ సంజీవ గాంధీ, వడిగా నాగార్జున, కుక్కుడపు చిన్న ఉసి బాబు లను…. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చక్కర వీరారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు… పార్టీ సమావేశంలో నాయకులు కట్టా రమేష్, కట్టా గోపాలరావు, కుక్కడపు శ్రీనివాసు పోతబత్తిని ప్రసాదు, పోతబత్తిని శ్యాంబాబు నకరేకంటి కర్నేషు, పోలబోయిన గోవిందు, సురభి బిక్షం కొల్లూరు నరసయ్య, పోతబత్తిని కాంత, మేదర వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.