కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతల నిరసనలు…తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ ముందు

కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు….పార్టీలో పని చెయ్యని వారికి పదవులు దక్కుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని నాయకుల చుట్టాలకి సైతం పదవులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.

గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ చాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ధర్నా చేపట్టారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో, కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొంతకాలంగా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీత రావు ప్రధానంగా ఆరోపించారు..