భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని మొత్తం సీన్ మార్చేశారు..దీంతో పాకిస్తాన్ పై దూకుకుపోతున్న మన బలగాలకు కాల్పుల విరమణ రూపంలో కేంద్రం హఠాత్తుగా బ్రేక్ లు వేయాల్సి వచ్చింది. పోనీ ఈ కాల్పుల విరమణతో భారత్ కు ఏదైనా ప్రయోజనం కలిగిందా అంటే అదీ లేదు. కానీ ఈ కాల్పుల విరమణకు కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్, పాక్ లపై విమర్శలు ఎక్కుపెట్టారు.
భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని తాను ఆపానని, లక్షల మంది పౌరుల ప్రాణాలు కాపాడానని ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై భారత్ ఇవాళ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్తాన్ పై తాము చేపట్టిన సైనిక చర్య పూర్తిగా సంప్రదాయ పరిధిలోనే ఉందని పేర్కొంది. పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ మే 10న సమావేశం అవుతుందని కొన్ని నివేదికలు వచ్చాయని, కానీ దీన్ని వారు తరువాత తిరస్కరించారని తెలిపింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి స్వయంగా రికార్డులో ఉన్న అణు కోణాన్ని ఖండించారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు. భారతదేశం అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని, దానిని ప్రేరేపిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పురికొల్పడాన్ని అనుమతించదని ఆయన తెలిపారు. ఈ మేరకు భారత్ దృఢమైన వైఖరితో ఉందన్నారు.వివిధ దేశాలతో జరిగిన సంభాషణలలో పాకిస్తాన్ అణు అంశాల్లో దూకుడు ప్రదర్శిస్తే వారి ప్రజలే నష్టపోతారని చెప్పామన్నారు. తద్వారా ట్రంప్ ఆరోపణలు పూర్తిగా తప్పని ఆయన తేల్చేశారు..
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి స్వయంగా రికార్డులో ఉన్న అణు కోణాన్ని ఖండించారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు. భారతదేశం అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని, దానిని ప్రేరేపిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పురికొల్పడాన్ని అనుమతించదని ఆయన తెలిపారు. ఈ మేరకు భారత్ దృఢమైన వైఖరితో ఉందన్నారు.వివిధ దేశాలతో జరిగిన సంభాషణలలో పాకిస్తాన్ అణు అంశాల్లో దూకుడు ప్రదర్శిస్తే వారి ప్రజలే నష్టపోతారని చెప్పామన్నారు. తద్వారా ట్రంప్ ఆరోపణలు పూర్తిగా తప్పని ఆయన తేల్చేశారు….మరోవైపు పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ (ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి రెండు దేశాల మధ్య జరిగిన చర్చలలో అమెరికాతో వాణిజ్యం గురించి ఎలాంటి చర్చలు జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో వాణిజ్యం ఆపేస్తానని తాను హెచ్చరించడం వల్లే భారత్-పాక్ వెనక్కి తగ్గినట్లు ట్రంప్ చేసిన ప్రకటనకూ కౌంటర్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే ప్రధాని మోడీ నిన్న జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో భారతదేశం ఏ విధమైన అణు బ్లాక్మెయిలింగ్ ను సహించదని తేల్చిచెప్పేశారు. పాకిస్తాన్పై చర్యలు ప్రస్తుతానికి మాత్రమే ఆపామని, భవిష్యత్ నిర్ణయాలు వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఇవాళ విదేశాంగశాఖ ప్రకటన దానికి కొనసాగింపుగా ఉన్నట్లు తెలుస్తోంది.