మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన కానిస్టేబుల్..!

*మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన కానిస్టేబుల్.*

*దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన స్థానికులు*

నంద్యాల జిల్లా డోన్‌లో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించాడు.

శ్రీరాంనగర్‌లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో ఐదు తులాల బంగారం చైన్‌ను కానిస్టేబుల్ ఆచారి బలవంతంగా దొంగలించేందుకు ప్రయత్నించాడు.

మహిళ కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకొట్టారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కానిస్టేబుల్ ఆచారిని అరెస్ట్ చేసి స్టేషన్‌ను తరలించారు….