కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు..
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ మంత్రి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు నివేదించినట్ల సమాచారం. తమ జిల్లాలో.. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కొండా దంపతులు వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ కలుగజేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టింది..
మంత్రి పొంగిలేటి పైన..!?
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి మరి ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. వీళ్లిద్దరి మధ్య ఓ కాంట్రాక్ట్ విషయమై ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవద్దని కొండా సురేఖ వారిస్తూ వస్తోంది. కానీ పొంగులేటి మాత్రం ఎక్కడా తగ్గకుండా తన పనులు తాను చేసుకుంటూ వెళ్లి పోతున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖకి సంబంధిచిన రూ 71 కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ ప్రధాన ఆరోపణ.
దేవాదాయ మంత్రి కొండా సురేఖ కు సంబంధం లేకుండా అన్ని తానై నడిపిస్తున్నట్టు పొంగులేటి పై కొండా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను దేవాదయ మంత్రిగా పట్టించుకోవడం లేదనే తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది కొండా సురేఖ. ముఖ్యంగా తనకు సంబంధించిన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటితో తమకు ఇబ్బందిగా ఉందని అధిష్టానానికి లేఖ రూపంలో గతంలో చెప్పిన కొండా మురళీ. ఈ నేపథ్యంలో పొంగులేటిపై స్వయంగా ఫిర్యాదు చేస్తూ సీఎం ను కొండా సురేఖ దంపతులు కలవడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
కొండా సురేఖ లేఖపై పొంగులేటి చేసిన ఫిర్యాదు పై ఆయన వర్గీయులు స్పందిస్తూ.. ఇంచార్జ్ మంత్రిగా ఆయన చట్టానికి అనుగుణంగా తన వాళ్లతో టెండర్స్ వేయించారు. మరోవైపు తనకు సంబంధించిన ఏరియాలో ఓ మంత్రిగా తన పనిచేసుకుంటూ పోతుంటే కొండా వర్గీయులు అడుగడున అడ్డు తగులుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారు పొంగులేటి వర్గీయులు. ఎవరితో ఎలాంటి పొరపొచ్చాలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్న పొంగులేటి పార్టీలో తనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కొండా సురేఖ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే అక్కసుతో ఈ ఫిర్యాదు చేసినట్టు పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. .