నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. చైనా మద్దతు లేదంటూ?..యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు.. అంటు వ్యాఖ్యలు..

యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు.. మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

శనివారం ఆయన సీపీఐ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. బార్డర్‌లో వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి నారాయణ సంతాపం తెలియజేశారు. (Pakistan) పాకిస్తాన్‌లో సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగించకూడదని నారాయణ చెప్పారు. ఇలా కామెంట్ చేసినందుకు పాకిస్తాన్ ఏజెంట్ అంటూ తనపై విరుచుకుపడ్డారని మండిపడ్డారు. కానీ నా ఉద్దేశం అర్థం చేసుకోలేదన్నారు. టర్కీ తప్పితే ఎవ్వరు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం లేదని, ప్రపంచం మొత్తం భారత్‌కి అండగా నిలుస్తున్నారని, పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందని చెప్పుకొచ్చారు. పాక్‌కు చైనా సపోర్ట్ చేస్తుందనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆడపిల్ల కన్నీరు ఊరికే పోదని, పహల్గాం ఉగ్రదాడిలో కాళ్ల పారాణి ఆరకముందే భార్య ముందర భర్తను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. (Indian Army) ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా టెర్రరిస్టుల క్యాంపుల మీద దాడి చేశారని కొనియాడారు. టెర్రరిస్టులను మట్టుబెట్టడంలో ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు……పాకిస్థాన్ కు చైనా సహాయం చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని నారాయణ అన్నారు.

తన వ్యాఖ్యలను…గతంలో మాట్లాడిన తన వ్యాఖ్యలను అపార్ధం ళచేసుకొని తనను పాకిస్థాన్ ఏజెంట్ అని కొందరు అంటున్నారని నారాయణ అన్నారు. భార్య కళ్ల ముందే కాల్లపారాణి ఆరకముందే కట్టుకున్న భర్తలను చంపిన ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మి ధాడులు చేయడాన్ని తాను తప్పు పట్టలేదని, సామాన్య ప్రజలపై దాడులు చేయడాన్నిమాత్రమే తాను తప్పుపట్టానని నారాయణ వివరించారు.

అందాల పోటీలతో ఏమి సందేశం ఇస్తున్నారు?

తెలంగాణలో అందాల పోటీలు (Miss World) నిర్వహిస్తున్నారని, ఈ పోటీలు ఏమి చెప్పదలుచుకుందని ప్రశ్నించారు. ఈ పోటీలతో రాష్ట్రం ఏమి సందేశం ఇస్తుందని నిలదీశారు. అధికారులు (Sophia Qureshi.. Vyomika Singh) సోఫియా ఖురేషి.. వ్యోమికా సింగ్ లాంటి వాళ్ళు కదా మనకి ఆదర్శమన్నారు. ఈ సుందరీమణులు ఎవరికి ఆదర్శమని మండిపడ్డారు. టూరిస్ట్ ప్లేసులో సుందరీమణులు ఊరేగిస్తామని అంటున్నారని, బిగ్‌బాస్ ప్రొగ్రామ్ లాంటిదే ఇది కూడా అని ఫైర్ అయ్యారు. అందాల పోటీలు నిర్వహించడం అంటే భారతీయ సంస్కృతిని అవమానించడమని, ఇది స్త్రీ జాతికి అవమానమని చెప్పారు. ఆడవాళ్ళ అందాలను ప్రదర్శించి వ్యాపారాలు చేస్తారా? అని నిలదీశారు. మగవాళ్లకు కూడా అందాల పోటీలు పెట్టి.. వ్యాపారం చేసుకోండని ప్రభుత్వానికి సూచించారు.