ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి..!.

టెస్ట్‌ సిరీస్‌ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్‌లో ల్యాండైన కేఎల్‌ రాహుల్‌ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇవాళ (జూన్‌ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్‌లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు..ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా బరిలోకి దిగిన రాహుల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

మరో ఎండ్‌లో జైస్వాల్‌ (17), కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన కరుణ్‌ నాయర్‌ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్‌ ఫామ్‌నే కొనసాగించిన కరుణ్‌ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న వేల క్రిస్‌ వోక్స్‌ అతనికి అడ్డుకట్ట వేశాడు.

వోక్స్‌ ఓ అద్భుతమైన బంతితో కరుణ్‌ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్‌ ఔటయ్యాక రాహుల్‌ ధృవ్‌ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్‌.. రాహుల్‌తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

55 ఓవర్ల అనంతరం భారత్‌-ఏ స్కోర్‌ 234/3గా ఉంది. భారత్‌-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్‌ వోక్స్‌ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

పాపం సర్ఫరాజ్‌..

ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను తప్పించారు. సర్ఫరాజ్‌ తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. రాహుల్‌ ఓపెనర్‌గా రావడంతో కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ మూడో స్థానానికి డిమోట్‌ అయ్యాడు.

బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్‌ కుమార్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ను బరిలోకి దించారు. అలాగే హర్ష్‌ దూబే స్థానంలో తనుశ్‌ కోటియన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్‌ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్…

మంచి స్టోరీ రాసే నైపుణ్యత మీలో ఉన్న మీ పేరుతోనే…. వార్తను సెండ్ చేయడం జరుగుతుంది..

ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..

ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ?

మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా మా వాట్సాప్ నెంబరుకు 9133057959 ద్వారా తెలియజేయండి…

నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు